డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. నేను కాదు మొర్రో.!


యంగ్‌ హీరోలకి నైట్‌ పార్టీలెక్కువైపోయాయ్‌.. ఆ మాటకొస్తే, నైట్‌ పార్టీల ట్రెండ్‌ అన్ని వర్గాల్నీ ఓ కుదుపు కుదిపేస్తోంది. సినీ, రాజకీయ కుటుంబాలకు చెందినవారే కాక.. సామన్యులూ నైట్‌ పార్టీల్లో ఎంజాయ్‌ చేస్తున్నారిప్పుడు. సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందినవారికైతే నైట్‌ పార్టీలు సర్వసాధారణమైపోయాయని వేరే చెప్పక్కర్లేదు కదా. కానీ, ఆ నైట్‌ పార్టీలు ఇప్పుడు చాలామందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కారణం నైట్‌ పార్టీల్లో డ్రింకింగే. 

డ్రింక్‌ చేసి, డ్రైవ్‌ చేసేవారి మీద పోలీసులు ప్రత్యేక నిఘా పెడ్తున్నారు.. వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. చాలాకాలంగా పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్ని సీరియస్‌గా తీసుకుంటున్నా, ఈ మధ్య అది మరింత సీరియస్‌ అయ్యింది. సెలబ్రిటీలు ఎక్కువగా ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. కొందరికి జరీమానాలు.. సీరియస్‌నెస్‌ని బట్టి కోర్టులో విచారణలు.. వెరసి సెలబ్రిటీలు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అంటేనే బెంబేలెత్తాల్సి వస్తోంది. 

ఆ మధ్య ‘మేనేజ్‌’ చేయగలిగినా, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కోర్టు దాకా వెళ్తున్నారు చాలామంది సెలబ్రిటీలు. ఈ మధ్య జైలు శిక్షలు కూడా పడ్తున్న దరిమిలా.. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు సెలబ్రిటీలకు షాకిస్తున్నాయి. మీడియాకి న్యూస్‌ అందిందంటే తమ ఇమేజ్‌ దెబ్బతింటుందని భయపడ్తోన్న సెలబ్రిటీలు కొంచెం జాగ్రత్తగానే వుంటున్నారు. నైట్‌ పార్టీల్లో మందు కొడితే, తప్పనిసరిగా డ్రైవర్‌ సహాయంతోనే ఇంటికి వెళ్ళాల్సి వస్తోంది. మరోపక్క, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో కొన్ని పేర్లు అనూహ్యంగా తెరపైకొస్తున్నాయి. మొన్నామధ్య అల్లు అర్జున్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఇరుక్కున్నాడన్న వార్తలొచ్చేసరికి, ‘అదంతా ఉత్తదే’ అని ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా యంగ్‌ విలన్‌ అజయ్‌ కూడా ఇలాగే తనపై వచ్చిన వార్తలకు వివరణ ఇచ్చుకున్నాడు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ అజయ్‌, మరో సినీ రచయిత తాజాగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. అయితే అజయ్‌ అనగానే అందరికీ కుర్ర విలన్‌ అజయ్‌ గుర్తుకొచ్చాడు. 

మరక మంచిదే.. అన్నట్టు, ఈ తరహా ప్రచారమూ మంచిదే. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కారణంగా నిత్యం విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పోలీసులు ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంతగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నది నిర్వివాదాంశం. ఈ తరహా కేసులకి ఎంత పాపులారిటీ వస్తే అంతగా ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’కి వ్యతిరేకంగా అవగాహన పెరుగుతుందని పోలీసులూ అభిప్రాయపడ్తున్నారు. 

Tags: Ajay, Drunk And Drive

బాబాయ్ అబ్బాయ్ లు ఇద్దరికీ స్పెషలే !!


ఈనెల 29 వ తేదీ నందమూరి హీరోలు ఇద్దరికీ స్పెషలే. బాబాయ్ బాలయ్య ఆ రోజుతో 40 ఏళ్ల సినిమా కెరియర్ అనే మైలురాయిని చేరతారు. అబ్బాయ్ ఎన్టీఆర్ తన తాజా సినిమా రభసతో జనం ముందుకు వస్తారు. 
తాతమ్మ కల...29.8.1974న విడుదలైంది. ఈ సినిమాతో బాలకృష్ణ సినిమా ప్రయాణం ప్రారంభమైంది. నూనూగు మీసాలతో, బక్కపల్చగా, సన్నని ఫ్రేమ్ వున్న కళ్లజోడు పెట్టుకుని బాలయ్య సినిమా ప్రవేశం చేసి, అప్పటి కుర్రకారును ఇట్టే ఆకట్టుకున్నారు. ఆ తరువాత అడపాదడపా చిన్నా చితకా సినిమాల్లో చేసినా దానవీరశూర కర్ణతో మళ్లీ మెయిన్ లైన్ లోకి వచ్చారు. 
బాబాయ్ అబ్బాయ్ లకు డేట్లతో కాస్త దగ్గరి సామీప్యాలున్నాయి. 82లో బాబాయ్ కు పెళ్లయింది. 83 ఈ 'అబ్బాయ్' పుట్టిన సంవత్సరం. 84 బాబాయ్ పెద్ద కమర్షియల్ విజయం సాధించారు. అదే మంగమ్మగారి మనవడు. 
2001లో బాబాయ్ నరసింహనాయుడు...అబ్బాయ్ స్టూడెంట్ నెం 1 విడుదలయ్యాయి.
మిగిలిన వ్యవహారాలు ఎలా వున్నా అభిమానుల దగ్గరకు వచ్చేసరికి నందమూరి అభిమానులందరూ ఇద్దరినీ అభిమానిస్తారు. అందుకే వారందరికీ ఈనెల 29 వెరీ వెరీ స్పషల్. 
Tags: August 29, Bala krishna, NTR, Rabhasa

పరిటాల వర్సెస్‌ వంగవీటి.!


ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రాజకీయ హత్యలపై చర్చ జరుగుతోంది. శాంతి భద్రతల అంశంపై చర్చ కాస్తా, రాజకీయ హత్యల వైపు మళ్ళింది. గడచిన మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోన్న దరిమిలా, చర్చ షురూ అయితే.. పదేళ్ళలో జరిగిన రాజకీయ హత్యలను తెరపైకి తెస్తోంది అధికార పక్షం. ఒక్కసారి చరిత్ర అంటూ తవ్వుకోవడం షురూ చేస్తే.. మూడు నెలలు.. మూడేళ్ళు.. పదేళ్ళు.. పాతికేళ్ళు.. ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంటాయి చర్చల్లోకి వచ్చే అంశాలు.

అలా, పరిటాల రవి హత్యోదంతం తెరపైకి వచ్చింది.. అదే సమయంలో వంగవీటి మోహనరంగా హత్యోదంతమూ చర్చనీయాంశమవుతోంది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో. పరిటాల రవి ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, వంగవీటి మోహనరంగా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ రెండు సామాజిక వర్గాలకు మధ్య రాజకీయ యుద్ధం.. అన్నట్టుగా తయారైందిప్పుడు పరిస్థితి. ఆయా సామాజిక వర్గాల్ని తమవైపుకు తిప్పుకునే దిశగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

పరిటాల రవి హత్య రాజకీయ కోణంలోనే జరిగిందన్నది కాదనలేని వాస్తవం. అయితే దాని వెనుక ఫ్యాక్షన్‌ తగాదాలు కూడా ప్రముఖ భూమిక పోషించాయి. వంగవీటి మోహనరంగా హత్య వెనుకా రాజకీయ కారణాలున్నాయి.. తెరవెనుక ముఠా తగాదాలూ పనిచేశాయి. పరిటాల రవి హత్యోదంతం పేరు చెప్పుకుని అధికార తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇరకాటంలోకి నెట్టేయాలని చూస్తుండగా, వంగవీటి మోహనరంగా హత్యోదంతాన్ని చర్చకు తెచ్చే ప్రయత్నాల్లో వుంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

2014 ఎన్నికల్లో ఓ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా నిలవడంతో, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తృటిలో విజయావకాశాల్ని మిస్సయ్యిందన్నది నిర్వివాదాంశం. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే వంగవీటి మోహనరంగా. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆ సామాజిక వర్గానికి మంచి పట్టుంది.. ఆ కోణంలో ఇప్పుడు వంగవీటి మోహనరంగా హత్యోదంతాన్ని ఎంతగా హైలైట్‌ చేస్తే వైఎస్సార్సీపీకి అంతగా రాజకీయ ప్రయోజనం చేకూరుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 

వాస్తవానికి కుల రాజకీయాల్ని ఎవరూ ప్రోత్సహించకూడదుగానీ, ఇప్పుడు నడుస్తున్నదే కుల రాజకీయాల ట్రెండ్‌ కావడంతో.. ఎవరూ దీన్ని పక్కన పెట్టలేకపోతున్నారు. హత్యల వెనుక రాజకీయ కోణాలుండడం.. వాటి పేరు చెప్పి కుల రాజకీయాల్ని పార్టీలకతీతంగా అందరూ రెచ్చగొడ్తుండడంతో.. ఏ ఉదంతం ఏ పార్టీకి లాభిస్తుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చకు రావడం సర్వసాధారణమైపోయింది.

ఎటూ పరిటాల రవి హత్య పేరుతో టీడీపీ రాజకీయం చేస్తోంది గనుక, వంగవీటి మోహనరంగా పేరుని వైఎస్సార్సీపీ క్యాష్‌ చేసకుంటే తద్వారా ఓ సామాజిక వర్గం దృష్టిలో మంచి మార్కులేయించుకోవచ్చన్నది వైఎస్సార్సీపీలోని ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు చేస్తోన్న ప్రతిపాదన. అటు తిరిగి.. ఇటు తిరిగి.. రాజకీయ హత్యలు కాస్తా.. కుల ప్రేరేపిత హత్యల వ్యవహారంగా మారిపోయిందన్నమాట. అందుగలడిరదులేడని సందేహమువలదు.. అన్నట్టుగా.. రాజకీయం అన్నిట్లోనూ కలగలసిపోయింది మరి.!

Tags: Andhra pradesh, Assembly, Paritala Ravi, TDP, Vangaveeti Rangaa, YSRCP

తెలివిగా మాట్లాడుతున్న బెల్లంకొండ


బుర్రలో గుంజు వుండాలే కానీ తప్పును కూడా ఒప్పు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెల్లంకొండ హీరో అదే చేస్తున్నాడు. రభస పబ్లిసిటీ అల్లుడు శీను లెవెల్ లో లేదని ఎన్టీఆర్ అభిమానుల ఆవేదన చెందడానికి అతగాడు ఫేస్ బుక్ ద్వారా బదులిచ్చాడు చాలా తెలవిగా.  

నేనంటే సినిమాలకు, జనాలకు కొత్త..ఎన్టీఆర్ కు కూడా అంత పరిచయం అవసరమా? అనే అర్థం వచ్చేలా అడుగుతున్నాడు. అంతే కాదు. నా సినిమా అంటే స్వంతంగా విడుదల చేసాం..రభస అమ్మేసాం..వాళ్లు చూసుకోవాలి ఫబ్లిసిటీ అంటున్నారట.  

నిజమే కేవలం చానెళ్లకే ఏడున్నర కోట్లు ఖర్చు పబ్లిసిటీకి ఖర్చు చేసారు. అందుకే ఇంకా టీవీల్లో అల్లుడి శీను హడావుడి వినిపిస్తూనే,కనిపిస్తోనే వుంది. మరి రభసకు కూడా అంత ఖర్చు చేయడం సాధ్యమా? అదంటే కొడుకు కోసం, ఇది కేవలం సినిమాను నిలబెట్టుకోవడం కోసం. దేని తేడా దానికి వుంటుంది మరి.

Tags: Bellamkonda Suresh, Rabhasa

మెగా మేనల్లుడిని ఈ చౌదరి ఏం చేస్తాడో.?


మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన ‘రేయ్‌’ సినిమా విడుదలకు నోచుకునే అవకాశాలైతే ఇప్పట్లో కన్పించడంలేదు. వైవీఎస్‌ చౌదరి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టాడు. ఆదినుంచీ ఈ సినిమాకి ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఆడియో వచ్చి ఏడు నెలలకు పైనే అయ్యింది. టీజర్ల మీద టీజర్లు వదిలారు. కానీ సినిమా విడుదలకు నోచుకోవడంలేదు. 

ఈలోగా ఇంకో సినిమా విడుదలకు సిద్ధమైపోయింది.. సాయిధరమ్‌తేజ్‌ హీరోగా ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ రిలీజ్‌ డేట్‌ని కూడా అనౌన్స్‌ చేసేశారు. ఒకప్పుడు వైవీఎస్‌ చౌదరి సంచలన దర్శకుడు. ‘యజ్ఞం’ సినిమాతో ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి కూడా సంచలన దర్శకుడే అన్పించుకున్నాడు. 

వైవీఎస్‌ చౌదరీ వరుస ఫ్లాపుల్లో వున్నాడు.. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి పరిస్థితీ అంతే. వైవీఎస్‌ చౌదరి సినిమా అటకెక్కింది.. ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతకీ, ఈ చౌదరి (ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి) సినిమాతో అయినా సియాధరమ్‌తేజ్‌ ప్రేక్షకుల ముందుకొచ్చి మెగా వారసుడిననిపించుకుంటాడా.? ఏమోగానీ.. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ఫర్వాలేదన్పించుకున్నా, ‘రేయ్‌’ చకచకా థియేటర్ల ముందుకొచ్చేయడం ఖాయమే. 

అంటే, రెండో సినిమా ఫలితమ్మీద తొలి సినిమా భవితవ్యం ఆధారపడి వుందన్నమాట.

Tags: Rey, Sai Dharma Tej, YVS Chowdary


అచ్బంగా బాబు నాటి వైఎస్ లా ..!


కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ఒకేసారి అధికారంలోకి వచ్చారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మోడీ అండతో బాబు అధికారంలోకి వచ్చారు. కానీ మోడీ స్టయిల్ రాజకీయం లేదా పాలన మాత్రం బాబు చేయడం లేదు. అధికారం అందింది ఆదిగా ఆయన తనది కాని ఓ కొత్త స్టయిల్ ను అలవర్చుకుంటున్నారు..అలవాటు చేసుకున్నారు.  

ఇప్పుడు బాబు అచ్చంగా వైఎస్ రాజశేఖర రెడ్డి స్టయిల్ ను తన స్టయిల్ గా మార్చుకుంటున్నారు. నమ్మినా నమ్మకున్నా పరిశీలనగా చూస్తే అందరూ అంగీకరించే నిజం. 

ఎన్నికలకు ముందే వైఎస్ మాదిరిగా పాదయాత్ర సాగించారు. ప్రజలకు ఫ్రీ కరెంట్ మాదిరిగా రుణమాఫీ హామీ ఇచ్చారు. అప్పుడు బాబు నో అన్నారు..ఇప్పుడు జగన్ నో అన్నాడు. 

గతంలో బాబుకు అంతగా కులాభిమానం కనిపించదు. కానీ ఈ సారి ఎన్నికల్లో గెలిచినది ఆదిగా ఆయన అచ్చంగా అదే పోకడలతో వెళ్తున్నారు. ఇందులో వైఎస్ స్టయిల్ కనిపిస్తుంది. అదే మాదిరిగా రాజకీయ, అధికార కీలకపదవులు తమ కులం వారికి కట్టబెట్టడంలో వైఎస్ అడుగుజాడల్లో ఇప్పుడు బాబు నడుస్తున్నారు. 

కాపు కులస్థుల అండతో పదేళ్లు పాలనను వైఎస్ సాగించారు. ఇప్పుడు అదే విధంగా బాబు ప్రారంభించారు తనపాలన. తమ కులస్థులకు మూడు పదవులు ఇస్తే, ఒకటి కాపులకు ఇవ్వడం ప్రారంభించారు. 

ఇక నిర్ణయాలు మొండిగా తీసుకుని ముందుకు పోవడంలో కూడా వైఎస్ స్టయిలే. ఎవరు ఏమనుకుంటే నాకేమిటి? తన నిర్ణయం తనది అనే విధంగా వెళ్తున్నారు. తాత్కాలిక రాజధాని ఇంకా కృష్ణా, గుంటూరు జిల్లాల విషయంలో. 

డబ్బులు ఎంత వున్నా లక్షల కోట్ల బడ్జెట్ కూడ వైఎస్ మాదిరే. అప్పుడు బాబు ఇలాంటి బడ్జెట్ ను ఛ..ఛ అనేవారు. ఇప్పడు అదే మార్గం అనుకుంటున్నారు. 

అసెంబ్లీలో వైఎస్ ప్రతిపక్షాన్ని తేలిగ్గా తోసి పుచ్చేవారు. చాలు చాల్లేవయ్యా..బాబూ..ఊరుకో..అని ఈసడింపుగా, తేలిగ్గా తీసేసేవారు. ఇప్పుడు బాబు ది కూడా అదే స్టయిల్. జగన్ ను ఇట్టే తీసేస్తున్నారు.  

మొదటి సారి అధికారంలోకి రాగానే, అడ్డం వచ్చినవారిని తప్పించుకోవడం ద్వారా, రెండోసారి అధికారంలోకి వచ్చాక మిగిలిన శతృవులను తన పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా చిరకాలం పాలించాలనుకున్నారు వైఎస్. ఇప్పుడు ఈ రెండూ ఒకేసారి చేస్తున్నారు చంద్రబాబు. 

మొత్తానికి చచ్చి ఏలోకాన వున్నారో కానీ, వైఎస్ ఒకప్పుడు చంద్రబాబుకు మంచి స్నేహితుడు..ఆ తరువాత బద్ధ శతృవు..ఇప్పుడు గురువుగా మారిపోయారు.

Tags: Chandrababu naidu, YSR

జూనియర్ స్టామినా తగ్గలేదు


సరైన హిట్ పడి చాలా కాలమైనా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదు. రభసకు సరైన ట్రయిలర్ ఒక్కటి కట్ చేయలేకపోయినా, ఇన్ టైమ్ లో విడుదల చేయలేకపోయినా, దర్శకుడికి, నిర్మాతకు మధ్య విబేధాలని ఎన్ని వార్తలు వచ్చినా సినిమా సేల్ మాత్రం అదిరిపోయిందని వార్తలు అందుతున్నాయి.  

ఆంద్ర, నైజాం, అదర్ ఏరియాలు, శాటిలైట్, ఓవర్ సీస్ అన్నీ కలిపి 56 కోట్లు పలికాయని తెలుస్తోంది. ఇదేమీ తక్కువ మొత్తం కాదు. నిర్మాత బెల్లంకొండ  పంట పండినట్లే. మహా అయితే ముఫై నుంచి నలభై మధ్యలో ఖర్చయి వుంటుంది. అంటే అల్లుడి శీనులో వచ్చిన లాస్ అంటూ ఏదైనా వుంటే అది కవర్ అయిపోయినట్లే. 

Tags: Bellamkonda Suresh, NTR, Rabhasa, Santhosh Srinivas

Popular Posts

r